21.10.2024 న సాయంత్రం 04.00 గంటలకు అశ్విన్ సోలోమోన్ తండ్రి సోలోమోన్, 20 సంవత్సరంలు, కులం నాడార్, డోర్ నం. 17(1),సంతోష్ స్ట్రీట్, దోహ్నాపూర్ గ్రామం మరియు పోస్ట్, పులియకురిచి తాలూకా, నాంగు నేరు (C-1) పొలికెస్తతిఒన్ ఏరియా, తిరునెల్ వెలి జిల్లా, తమిళినాడు రాష్ట్రం అను వ్యక్తి గంజాయి నిమిత్తం తమిళనాడు లో బయలుదేరి ముంచగిపుట్టు లో ఒక వ్యక్తి వద్ద 4 kg ల గంజాయి ని 15000/- రూపాయలకు కొని ముంచంగిపుట్టు నుండి బయలుదేరి తాటిపత్రి చెక్ పోస్ట్ వైపు వెళితే పోలీసులుపట్టుకుంటారు అని 12 వ మెయిల్ రోడ్డు వద్ద బస్సు దిగి, కోణం వైపు గా అప్పలరాజుపురం గ్రామం వరకు వచ్చి ఆటో కోసం వేచి ఉండగా చీడికాడ పోలీస్ వారు వాహనాలు తనికీ చేస్తున్న తరుణంలో పట్టుబడటంతో చీడికాడ పోలీస్ స్టేషన్ SI బి. సతీష్ గారు NDPS ACT ప్రకారం కేసు నమోదు చేసి, గంజాయిని సీజ్ చేసి తేది 22.10.2024 న రిమాండ్ నిమిత్తం ముద్దాయిని చోడవరం మేజిస్ట్రేట్ వద్ద హాజరు పరచడమైంది.
4 కేజీల గంజాయితో తమిళనాడు వ్యక్తి అరెస్ట్ 15000 రూపాయలు స్వాధీనం
