అమలాపురం ఎర్ర వంతెన వద్ద పోలీస్ క్వార్టర్స్ గ్రౌండ్లో అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జిల్లా ఎస్పీ కృష్ణారావు,రెవెన్యూ డివిజనల్ అధికారి,రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్ర బోస్ పాల్గొని అమరవీరులకు పుష్ప మాలలతో ఘనంగా నివాళులర్పించి అమరవీరుల యొక్క త్యాగాలను కొనియాడారు. కార్యక్రమంలో కొంతమంది అమరవీరులైన పోలీస్ తల్లిదండ్రులు తల్లులు హాజరై అమర వీరులకు నివా ళులర్పించి వారి కన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నారు.
అమర వీరుల త్యాగాలను స్మరించుకున్న జిల్లా అధికారులు
