ఇటీవల కాలంలో తీసుకువచ్చినటువంటి నూతన విద్యుత్ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చి అదిక కరెంట్ చార్జీల పేరుతో వసూలు చేస్తుంది. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బి. టి దొర మాట్లాడుతూ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలందరికీ గతంలో వాడుకున్న విద్యుత్తుకు నేడు బిల్లులు కట్టించుకునే విధానం మానుకోవాలని. విద్యుత్ చార్జీల్లో ఇందన సర్దుబాటు ట్రూ ఆఫ్ చార్జీలు సెక్స్లు వెంటనే రద్దు చేయాలని. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యుత్ స్మార్ట్ మేటర్ లు బిగింపు నిలుపుదల వెంటనే ఆపువేయాలని.విద్యుత్ సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజలపై మోగుతున్న 20వేల కోట్ల భారాలను వెంటనే రద్దు చేయాలని. కార్పొరేటర్లకు వరాలు కట్టబెట్టి సామాన్య ప్రజలపై బారాలు మోపి విద్యుత్ సంస్కరణ వెంటనే మానుకోవాలని. గత రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యుత్ సవరణ చట్టాలు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న టిడిపి, జనసేన, వ్యతిరేకించాయి. కానీ ఈనాడు అధికారంలోకి రాబోయే సరికి అదేవిధంగా అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తీరును సిపిఎం పార్టీ దీన్ని ఖండిస్తుంది. నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు శ్రీకాకుళంలో స్మార్ట్ మీటర్ల బిగింపును ఆపివేయాలని అలాగే స్మార్ట్ మీటర్లు వెంటనే బద్దలు కొట్టాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలో అన్నారు. అధికారంలోకి రాబోయే సరికి అదే విధానాల అమలు చేయడం వల్ల ప్రజలు దిన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ఈ విధానాల అమలు మార్చుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని బి. టి. దొర అన్నారు. ఈ కార్యక్రమంలో జర్త ఈశ్వరరావు, బుచ్చిబాబు, తదితరులు ఈ కార్యక్రమంలో అధిక మంది మహిళలు పాల్గొనడం జరిగింది.
విద్యుత్ చట్టానికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ దీక్ష
