డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట లో శుక్రవారం జరిగే శ్రీ విజయ బేతాళ స్వామి వారి 59వ వార్షికోత్సవం పురస్కరించుకొని వాహన మహోత్సవమునకు భక్తులు ప్రజలు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని శెట్టిబలిజ అభ్యుదయ సంఘం పిలుపునిచ్చింది.
ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఉత్సవ కమిటీ చైర్మన్ శీలం మోహనరావు మాట్లాడుతూ 1967 సంవత్సరం నుండి అంబాజీపేటలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. శ్రీ విజయ బేతాళ స్వామి ని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తారని అన్నారు. అదేవిధంగా మాచవరం గ్రామంలోని 13 శెట్టిబలిజ పాలెములకు చెందిన వారందరూ ఈ మహోత్సవములో కుటుంబ సమేతంగా పాల్గొంటారన్నారు. సుదూర ప్రాంతాలనుండి కూడా అన్ని వర్గాల ప్రజలు వచ్చి బేతాళ స్వామి మహోత్సవంలో పాల్గొని బేతాళ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకుంటారన్నారు.ఈ తీర్థ మహోత్సవంలో చేడి తాలింఖానా అగ్గి బరాటాలు మరియు తీన్మార్ వాయిద్యాలు శక్తి వేషాలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు. అనంతరం భారీ బాణాసంచా కాల్పులు ఉంటాయన్నారు. విత్తనాల శేఖర్ మాట్లాడుతూ భక్తుల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని బేతాళ స్వామి ఆశీస్సులు పొంది అందరూ సుఖసంతోషాలతో ఉండాలన్నారు.అలాగే 13 వాహనాలు అంబాజీపేట సెంటర్ కి చేరుకునే సందర్భంలో సంఘ నాయకులు అందరూ క్రమ పద్ధతుల్లో వాహనాలను తీసుకురావాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.