శోభయాత్ర..బోనాల ఊరేగింపు శివ శివసత్తు ల పూనకాలు..పోతరాజుల విన్యాసాలు .. దుర్గామాత కళ్యాణం పట్టణంలో భక్తి పారవశ్యం ఉప్పొంగింది. జిల్లా కేంద్రం బతుకమ్మకుంట శ్రీ విజయదుర్గామాత జాతర ఉత్సవాలు బుధవారం మూడో రోజు కొనసాగాయి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బోడ్రాయి, వాస్తు గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి నెహ్రూ పార్కు వద్దకు చేరుకున్నారు.
పొట్టేళ్ల రధం పై అమ్మవారి శోభాయాత్ర కనుల పండగగా సాగింది దుర్గామాతకు బోనాలు సమర్పించేందుకు వేలాదిగా మహిళలు తరలివచ్చారు అర్ధరాత్రి 12 గంటల వరకు దర్శనాలు కొనసాగాయి, అంతకుముందు పద్మశాలి కుల సంఘం ఆధ్వర్యంలో మగ్గం ఏర్పాటు చేసి పట్టు వస్త్రాలను తయారు చేసి అమ్మవారికి సమర్పించారు, పుట్ట బంగారంతో గద్దెల నిర్మాణం చేసి ఆలయ ప్రాంగణంలో పట్నం వేసిన అనంతరం ఆలయంలో ఒగ్గు పూజారులు దుర్గా మాత కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
అమ్మవారికి ఎమ్మెల్యే పల్లా రాజశేఖర్ రెడ్డి గారు పట్టు వస్త్రాలను సమర్పించారు, ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు అమ్మవారి దర్శన సమయంలో భక్తులకు ఇబ్బంది కలుగుకుండా భారీకెేడ్లు ఏర్పాటు చేశారు నేడు గురువారం ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం కుటుంబాలు సామూహిక వనభోజనాలకు వెళ్లడంతో నాలుగు రోజుల జాతర ముగుస్తుంది.