నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కెన్ హార్ట్ బ్రాండ్ పేరుతో గత పది సంవత్సరాలుగా ఎగ్జిబిషన్ కం సేల్ ని నిర్వహిస్తోంది దేశవ్యాప్తంగా శిక్షణ పొందిన గ్రామీణ కళాకారులకు మార్కెటింగ్ అవకాశాలను అందించడానికి నాబార్డ్ యొక్క వివిధ గ్రాంట్ ఆధారిత కార్యక్రమాలు మరియు పథకాల ద్వారా మద్దతిస్తోంది.
ఈ సంవత్సరం గ్రామీణ సెలబ్రేటింగ్ డెవలప్మెంట్ పేరుతో ఈ నెల 16 నుంచి 22 వరకు అమీర్పేటలోని కమ్మ సంఘం హామీలు నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ కం సేల్ ను తెలంగాణ చేనేత జౌళి ఎం ఈ కమిషనర్ శ్రీమతి శైలజ రామ అయ్యర్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో నాబార్డ్ సీజీఎం ఉదయభాస్కర్, ఎన్ ఐ- ఎమ్ ఎస్ ఎమ్ కి చెందిన శరత్ ముత్యాల ,తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్పర్సన్ శ్రీమతి సోహ , రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం జగదీప్ , నాబార్డ్ జనరల్ మేనేజర్ ఆర్ గణపతి , తెలంగాణ నాబార్డ్ ఏజీఎం డి రవిశంకర్ అధికారులు మరియు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన చేనేత , హస్త కళాకారులు పాల్గొన్నారు.