ఎరుకల పెద్ద సాయిలు ఇంటిపై 50 మంది కిరాయి గుండాలచే దాడి చేయించి కులం పేరుతో దూషించి తిరిగి అతని తల్లి 70 సంవత్సరాల వృద్దురాలుపై తిరిగి తప్పుడు కేసు పెట్టిన వారి పైన చర్యలు తీసుకొని వారి కుటుంబానికి న్యాయం చేయాలని తెలంగాణ ఎరుకల గిరిజన హక్కుల ఐక్య పోరాట సమితి సాధన సమితి కోనేరు సాయికుమార్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సింధు శర్మ కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కోనేరు సాయికుమార్ మాట్లాడారు కామారెడ్డి జిల్లా గాంధారి గ్రామానికి చెందిన ఎరుకల పెద్ద సాయిలు తండ్రి ఎరుకల నరసయ్య గత 25 సంవత్సర క్రితం గాంధారి వారి కుటుంబంతో సహా వచ్చి దేశ్ పాండ్ హనుమంతరావు గారి వద్ద ఖరీదుకు భూ స్థలం తీసుకోవడం జరిగిందని మూడు గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్నామని తెలిపారు.
అయితే గత నెల 26 తేదీ రోజున దిలీప్ రావు, కృష్ణ గౌడ్ ,భాస్కర్ గౌడ్, తాటి మధుసూదన్, బేజుగం సంతోష్ వారే కాకుండా కామారెడ్డి నుండి బిక్కునూరు నుండి 50 మంది ఆడ మగ గుండెలను తీసుకువచ్చి ఇంటిలో లేని సమయంలో ఇంటిపై దాడి చేసి ఎరుకల బుద్దవ్వ, ఎరుకల రేణుక, ఎరుకల సాయవ్వ ఎరుకల రమేష్ పైన బూతు మాటలు తిడుతూ ఇష్టం వచ్చినట్లు దాడి చేయడం జరిగిందని, దీనిపైన గాంధారి ఎస్సై కి ఫిర్యాదు చేస్తే తిరిగి మీరే వారి పైన దాడి చేశారని నీపైనే కేసు నమోదు అవుతుందని అంటున్నాడని, ఇట్టి విషయం పైన జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగిందని ఎస్పీ గారు స్పందించి దాడి చేసిన వారి పైన దాడి చేయించిన పైన వారి పైన కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిట్ కేసు నమోదు చేసి ఏం చేస్తామని తెలిపారని అన్నారు.
అంతేకాకుండా ఇట్టి విషయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కుర్ర రాములు ఎరుకల భూమవ్వ, ఎరుకల పెద్ద సాయిలు ఎరుకల రేణుక, ఎరుకల సాయవ్వ, ఎరుకల రమేష్ పాల్గొన్నారు.