స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూలుకుంట్ల లావణ్య రెడ్డి గారిని, వైస్ చైర్మన్ నూకల ఐలయ్య గారితో పాటు డైరెక్టర్లను శాలువాలాతో పూలమాలతో ఘనంగా సన్మానించి వారిని అభినందించారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ…సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. నూతనంగా ఏర్పడిన మార్కెట్ కమిటీ పాలకవర్గం రైతుల అభివృద్ధికి కృషి చేయాలని, రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడే వారికి రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. మరో 2 రోజుల్లో ఇందిరమ్మ కమిటీలు వేసుకోబోతున్నామని పేర్కొన్నారు. ఈ కమిటీల్లో కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసే పాతవారికి, కొత్తవారికి సమన్యాయం చేసే విధంగా ఇందిరమ్మ కమిటీలు ఉంటాయని ఆయన అన్నారు.