నిజాంపేట మండల వ్యాప్తంగా శనివారం దేవి శరన్నవరాత్రులను ముగించుకొని ఆయా గ్రామాలలో దసరా పండుగ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో శ్రీ దుర్గా మాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కాషాయ జెండాను ఆవిష్కరించి మహిషాసుర మర్దిని దహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దేవి శరన్నవరాత్రులను ముగించుకుని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహిషాసుర మర్దిని దహన కార్యక్రమం చేపట్టి కులాలకు అతీతంగా గ్రామస్తులు అందరూ కలిసి డప్పు చప్పుల మధ్య పాలపిట్టను వీక్షించేందుకు పెద్దమ్మ ఆలయం వద్దకు తరలి వెళ్లామన్నారు. ఆ దుర్గమ్మ వారి కృపతో గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పాడిపంటలు సుభిక్షంగా పండాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పురోహితులు వేలేటి లక్ష్మణ శాస్త్రి, దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులువెంకటేష్ గౌడ్,చంద్రకాంత్ గౌడ్, రంజిత్ గౌడ్, లక్ష్మణ్, కరుణాకర్, సిద్ధరామ్ రెడ్డి, సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, కిష్టారెడ్డి, కోమ్మట సత్యనారాయణ, చీకోటి వెంకటేశం, వినయ్ గౌడ్,గెరిగంటి బాబు ప్రశాంత్ గౌడ్,శివకుమార్ గౌడ్,ప్రశాంత్,తదితరులు పాల్గొన్నారు.