నరసరావుపేట పట్టణంలో క్రిస్టియన్ భూములు అన్యాక్రాంతం చేస్తున్న బడా బాబులు….
పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద క్రిస్టియన్ చర్చి భూములు రాత్రికి రాత్రి గోడల కట్టి బిల్డింగులు నిర్మిస్తున్నారు…
ఇటీవల డి మార్ట్ పెట్టిన తర్వాత అక్కడ క్రిస్టియన్ భూములకి రెక్కలు వచ్చాయి, వ్యాపార రంగాలకు అద్దెలకు ఇచ్చేందుకు రడీ అయ్యారు…..
క్రిస్టియన్ భూములకు సంబంధించి ప్రస్తుతం అది కోర్టులో కేసు నడుస్తోంది అది తేలకముందే టిడిపి నాయకులు అండతో నిర్మాణాలు చేపట్టారు…..
కోట్ల రూపాయలు విలువచేసే క్రిస్టియన్ భూములు తప్పుడు పత్రాలను సృష్టించి భూములు కొట్టేసేందుకు కొందరు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు….
దీనిపై క్రిస్టియన్ భూములు పరిరక్షణ కమిటీ సభ్యులు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు, దీనిపై ప్రజా సంఘాల నేతలతో రేపు రౌండ్ టేబుల్ సమావేశం…
ఈ సమావేశంలో కార్యచరణ రూపొందించి జిల్లా కలెక్టర్ మరియు ఎస్పి ని కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నారు.