అదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో తొమ్మిది రోజులపాటు నిత్యం పూజలందుకున్న దుర్గామాత చివరి తొమ్మిదవ రోజున దుర్గ మాతా ..పట్టణ పుర వీధుల గుండా అమ్మ భక్తులు తో పాటు యువకులు గ్రామస్తులు దుర్గామాత శోభ యాత్ర ఘనంగా నిర్వహించారు… భక్తులు అమ్మ భవాని పాటలకు నృత్యాలు చేశారు.అనంతరం స్థానిక మార్కెట్ యార్డ్ ఆవరణలో.. మైషాసుర దహన కార్యక్రమం ఏర్పాటు చేసిన చేసిన వేదిక వద్ద ఆదివాసీలు డోలు వాయిద్యాలతో ఆదివాసీ మహిళ లు నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి ..అదే విధంగా వందలాది మంది యువకులు నృత్యాలు చేస్తూ పండగ వాతావరణం నెలకొంది.అంతరం మాత మైశాసురిడిని దహనం చేస్తున్న దృశ్యం వేలాదిమంది గ్రామస్తులు.. వీక్షించారు.అలాగే నేరేడిగొండ మండల కేంద్ర ంలో బోథ్ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మైశాసురిడిని దహనం చేసి దుర్గ మాత ఊరేగింపులో పాల్గొని దుర్గ మాత వద్ద యువకులతో నృత్యాలు చేశారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ అధర్మం మరియు చెడు పై మంచి సాధించిన విజయంగా దసరా పండగ జరుపుకుంటామని అన్నారు.బోథ్ నియోజక వర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో దుర్గామాత భక్తులు యువకులు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బోథ్ మండలంలో దుర్గామాత శోభాయాత్ర ఘనంగా నిర్వహణ
