నియోజకవర్గ ప్రజలకు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జగన్మాత ఆశీస్సులతో నియోజకవర్గం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులు, సిరి సంపదలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. విజయాలను అందించే విజయ దశమిగా దసరా పండుగను ఒక్కోచోట ఒక్కో విధంగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దసరా రోజున పాలపిట్టను దర్శించి, జమ్మిచెట్టుకు పూజలు చేసి, జమ్మి ఆకును బంగారంలా పరస్పరం పంచుకొంటూ, పెద్దల ఆశీర్వాదాలను అందుకుంటూ, అలయ్ బలయ్ తీసుకొంటూ ప్రేమాభిమానాలను చాటుకోవడం ఎంతో గొప్ప సంప్రదాయమని చెప్పారు.
దసరా పండుగకు ప్రజలకు కడియం శ్రీహరి శుభాకాంక్షలు
