తెలంగాణ ప్రజల జీవన విధానంలో నుంచి పుట్టిన ప్రకృతి పండుగ, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. పువ్వులే బతుకమ్మగా పూజలందుకోవడం తెలంగాణ ప్రజలకు ప్రకృతి పట్ల ఉన్న ఆరాధనను, కృతజ్ఞతా భావనను తెలియజేస్తుందని అభివర్ణించారు. చిన్నా, పెద్ద…. పేద, ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు సమిష్టిగా జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనదని తెలిపారు. ఈ సందర్బంగా తెలంగాణ ఆడపడుచులకు, ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. చెరువుల వద్ద బతుకమ్మలను నిమజ్జనం చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
బతుకమ్మ పండుగపై డాక్టర్ కడియం కావ్య అభిప్రాయం
