గ్రామాలలో అప్పటికప్పుడు కొంతైనా సమస్యలను నెరవేర్చుకునే విధంగా గ్రామీణ మంచినీటి సహాయకులకు నాలుగు రోజులపాటు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, శిక్షణ పొందిన వారికి ప్రభుత్వంచే జారీ చేయబడిన ద్రుపత్రాలు అందించడం జరిగిందని, ఆర్డబ్ల్యూఎస్ ఈ ఈ సంపత్ కుమార్ అన్నారు. చిన్న శంకరంపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గ్రామీణ మంచినీటి సహాయకులకు గత నాలుగు రోజులుగా మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ భిక్షపతి ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు.
ఈ శిక్షణా శిబిరంలో హ్యాండ్ పంపు రిపేరు, సింగల్ ఫేస్, త్రి ఫేస్ మోటార్ల రిపేరు, ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్, పైప్ లైన్ లీకేజీలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నేడు చివరి రోజు శిక్షణ శిబిరానికి ఆర్డబ్ల్యూఎస్ ఈ ఈ సంపత్ కుమార్ హాజరై శిక్షనకు హాజరైన వారితో మాట్లాడి శిక్షణ విషయాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం శిక్షణ పొందిన వారికి ఆయన సర్టిఫికెట్లను అందజేశారు. ఈ ఈ సంపత్ కుమార్ మాట్లాడుతూ గ్రామాలలో ఏదైనా నీటి సమస్య ఏర్పడితే అప్పటికప్పుడే మరమ్మతులు చేసుకునే విధంగా తోడ్పడేందుకు నాలుగు రోజుల పాటు గ్రామీణ మంచినీటి సహాయకులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దామోదర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ బిక్షపతి,ఎంపీఓ గిరిజారాణి, తదితరులు పాల్గొన్నారు.