కరోనా హౌస్ లో కూర్చుని కలెక్షన్లు చేసిన కాకాణిని వదిలే ప్రసక్తే లేదు
సూరాయపాళెం, విరువూరు రీచ్ ల్లో రూ.91 కోట్ల దోపిడీ తేలింది…ఇది పదో వంతు మాత్రమే
వైసీపీ పాలనలో కాకాణికి తెలియకుండా సర్వేపల్లి నుంచి ఇసుక రేణువు కూడా కదిలే అవకాశమే లేదు
ఐదేళ్లలో జరిగిన దోపిడీపై సమగ్ర విచారణ జరిగితే ఎన్ని వందల కోట్లు తేలుతుందో
దోపిడీ సొత్తును వడ్డీతో సహా కక్కించే వరకూ ఊరుకోను
నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో పొలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
సర్వేపల్లి నియోజకవర్గంలోని పెన్నా తీరాన సూరాయపాళెం, విరువూరు రీచ్ లు ఉన్నాయి
ఈ రెండు రీచుల్లో గత ప్రభుత్వ హయాంలో అక్రమ మైనింగ్ జరిగిందని అధికారులు నిర్ధారించారు
సూరాయపాళెంలో సర్వే చేసి రూ.54.70 కోట్లు ఫెనాల్టీ విధించారు
2,73,500 టన్నుల ఇసుకను అక్రమంగా తవ్వి తరలించినట్లు తేల్చారు
ఇది కేవలం 2023 డిసెంబర్ నుంచి ఎన్నికల ఫలితాలు వచ్చిన జూన్ 4వ తేదీ వరకు జరిగిన దోపిడీ మాత్రమే
విరువూరు రీచ్ లోనూ అక్రమాలను నిర్ధారించి రూ.37 కోట్లు ఫెనాల్టీ వేశారు
ఇక్కడ 185000 టన్నుల ఇసుకను దోచేశారని అధికారులు తేల్చిచెప్పారు
రెండు రీచుల్లో కలిపి రూ.91.70 కోట్లు విలువైన ఇసుకను దోచేశారని నిర్ధారణ అయింది
జేపీ వెంచర్స్ తో కలిసి విరువూరుకు చెందిన వైసీపీ నేత బచ్చల సురేష్ కుమార్ రెడ్డి(చిన్ని) అక్రమంగా ఇసుక తరలించినట్టు తేలింది
అనుమతులు పొందిన చోట కాకుండా పరిధి దాటి వ్యవహరించి ఈ అక్రమాలకు పాల్పడ్డారు
2019 నుంచి 2021 వరకు భారీగా అక్రమ మైనింగ్ జరిగినా దాని కొలతలు వేయలేదు
2022లో వచ్చిన వరదల కారణంగా కొలతలు వేయలేకపోయామని అధికారులు తప్పించుకున్నారు
వైసీపీ అధికారంలోకి వచ్చిన తెల్లారి నుంచే సూరాయపాళెం, విరువూరు రీచ్ ల నుంచి వందల కోట్ల విలువైన ఇసుకను లేపేశారు
ఒక్క ఇసుకే కాదు గ్రావెల్, మట్టి, క్వార్జ్ దేనీనీ వదిలిపెట్టకుండా దోచేశారు
రైతుల పొలాలు సారవంతం చేసేందుకు క్యూబిక్ మీటర్ మట్టిని రూ.1కి ఇవ్వాలని గతంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన జీఓను సైతం దుర్వినియోగం చేశారు
5.75 లక్షల క్యూబిక్ మీటర్లకు రైతుల పేరుతో అనుమతులు పొంది సర్వేపల్లి రిజర్వాయర్, కనుపూరు చెరువులోని గ్రావెల్ మొత్తాన్ని ప్రైవేటు లేఅవుట్లకు అమ్మకున్నారు
నిబంధనల ప్రకారం వాణిజ్య అవసరాలకు మట్టి తోలితే క్యూబిక్ మీటరుకు రూ.231 చెల్లించాలి
ఈ విధంగా మట్టిలోనూ రూ.15 కోట్లకు పైగా దోపిడీకి పాల్పడ్డారు
నిత్యం సూరాయపాళెం రీచ్ లో రూ.100 కోట్ల దోపిడీ అంటూ పాటపాడే కాకాణి గోవర్ధన్ రెడ్డి దోపిడీపర్వం అధికారికంగా వెలుగులోకి వచ్చింది
ఎన్నికల ఫలితాలు వచ్చే రోజుకి ముందు ఆర్నెళ్లలోనే రూ.100 కోట్లకు పైగా దోపిడీ జరిగిపోయిందని స్పష్టమైంది
మొత్తం ఐదేళ్లలో జరిగిన దోపిడీని నిగ్గుతేలిస్తే ఎన్ని వందల కోట్లు బయటపడుతుందో
నేను కాకాణి గోవర్ధన్ రెడ్డిలా నోటికొచ్చినట్టు వాగడం లేదు..అలా వాగడం నాకు చేత కూడా కాదు
ప్రభుత్వ ఉత్తర్వులు, అధికారులు ఇచ్చిన రిపోర్టులు, షోకాజ్ నోటీసులు, సమాచార హక్కు చట్టం ద్వారా పొందిన సమాచారంతోనే మాట్లాడుతున్నాను
వైసీపీ ప్రభుత్వంలో కాకాణి గోవర్ధన్ రెడ్డికి తెలియకుండా సూరాయపాళెం, విరువూరు రీచ్ ల నుంచి ఇసుక రేణువైనా కదులుతుందా
కాకాణి ఆదేశాలు లేకుండా సర్వేపల్లి రిజర్వాయర్, కనుపూరు చెరువులతో పాటు కసుమూరు, రామదాసుకండ్రిగ, ఈదగాలి నుంచి గ్రావెల్ ఎత్తే దమ్ము ఎవరికైనా ఉందా…
గోవర్ధన్ రెడ్డికి సంబంధం లేకుండా వరదాపురం, మరుపూరు, మొగళ్లూరు, ముదిగేడు నుంచి క్వార్ట్జ్ కదలించగలరా
మంత్రిగా గూడూరు నియోజకవర్గంలోని సిలికాను కూడా కాకాణి వదిలి పెట్టలేదు
కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన దోపిడీలో ఇప్పుడు 10 పైసలు భాగం మాత్రమే బయటపడింది
ప్రజల సొత్తును సాంతం దోచేసిన కాకాణికి నిద్రలేచి నన్ను, మా నాయకుడు చంద్రబాబు నాయుడిని తిట్టే అర్హత ఎక్కడిది
కరోనా హౌస్ లో కూర్చుని కలెక్షన్లు లెక్కపెట్టుకుంటూ సర్వేపల్లిని సర్వనాశనం చేసిన వ్యక్తి మాపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది
ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం దురదృష్టకరం
ఇసుక స్కాంలో ఏ1 అయిన కాకాణిని తప్పించి ఆయన చెంచాలకు నోటీసులు ఇచ్చారు
ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అక్రమ మైనింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిగే వరకూ ఊరుకోను
కరోనా హౌస్ యజమాని కాకాణి కటకటాలు లెక్కపెట్టే వరకు వదలను
దోచిన సొత్తును వడ్డీతో సహా కట్టించే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదు