ధర్మసాగర్ మండలం దేవునూర్ గ్రామానికి చెందిన చిట్యాల నితిన్ మహబూబాబాద్ లోని మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ సీటు సాధించి ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్న విషయం ఎమ్మెల్యే కడియం శ్రీహరి దృష్టికి రావడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కడియం ఫౌండేషన్ ద్వారా కళాశాల ఫీజు నిమిత్తం మెడికల్ విద్యార్ధి చిట్యాల నితిన్ కు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావడంతో పాటు పేద ప్రజలకు సేవ చేయాలని సూచించారు. దింతో తన పరిస్థితిని అర్థం చేసుకొని ఆర్ధిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి , కడియం ఫౌండేషన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
చిట్యాల నితిన్‌కు కడియం ఫౌండేషన్ ఆర్థిక సహాయం
