స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కర్ణను కేంద్రం భేషత్తుగా విరమించుకోవాలి… స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను బేషరతుగా విరమించాలి స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి స్టీల్ ప్లాంట్ ను సొంత గనులు కేటాయించాలి స్టీల్ ప్లాంట్ కు 10,000 కోట్ల రూపాయలు నిధులు వెంటనే వర్కింగ్ క్యాపిటల్ కేటాయించాలి. స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛంద పదవి విరమణ పథకాన్ని విరమించుకోవాలి స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఉద్యోగులను ఇతర ప్లాంట్ కు బదిలీ చేయడాన్ని నిలిపివేయాలి. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులందరికీ శాశ్వత ఉద్యోగాలు కల్పించాలి. కాంట్రాక్ట్ కార్మికులందరినీ క్రమబద్ధీకరించాలి. రిజర్వేషన్ను పక్కడిబందీగా అమలు చేయాలి. ఈ డిమాండ్లతో కూడిన తీర్మానాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు సంస్థ ఈ మహాసభలో ప్రతిపాదిస్తుంది. అయితే ఈ తీర్మానంలో ప్రతిపాదించిన అంశాలకు వ్యతిరేక దిశలో కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. స్టీల్ ప్లాంట్ ను కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి సన్నాహాలకను వేగవంతం చేస్తుంది. ఇందులో భాగంగానే 4290 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని రాత్రికి రాత్రి తొలగించే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా 500 మంది అధికారుల్ని చత్తీస్గడ్ ఫ్యాక్టరీకి బదిలీ చేయాలని, మరో 2500 మందిని ఉద్యోగాల్ని వీ.ఆర్.ఎస్. ద్వారా బయటకు పంపాలని ఆలోచిస్తుంది…. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటు కర్ణ వైఖరి అని రద్దు చేసుకోకపోతే కేంద్ర ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరిస్తామని టిడిపి జనసేనలు ప్రకటించాలని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ డిమాండ్ చేస్తున్నది. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం విశాల ఐక్య ప్రజా ఉద్యమ నిర్మాణానికి ప్రజలు కొనుకోవాలని ఈ సంస్థ ఏకగ్రీవంగా కోరుతుంది….
విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసన
