కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని చిట్యాల గ్రామంలో ఇళ్ల నిర్మాణ స్థలంపై వివాదం ఏర్పడింది.
1998లో ప్రభుత్వానికి చెందిన 4 ఎకరాల స్థలంలో ఎస్సీలకు, బీసీ, ఓసీలకు పట్టాలు మంజూరు చేసిన విషయం తెలిసిందే.
గుడిసెలు వేసిన ఎస్పీ వర్గం వారు, ధాన్యం ఆరబోయడానికి కళ్లాలు నిర్మించాలని బీసీ, ఓసీ వారు కోరడంతో వివాదం చెలరేగింది.
“రోడ్డు పక్కన మేము ముందువరుసలో ఇళ్లు నిర్మిస్తాము” అని ఇరువర్గాలు దోబూచుకలగా ఉన్నారు.
ఒక వర్గం “అందరి ఇళ్లు కలిపి నిర్మించాలి” అని అభిప్రాయపడగా, మరొక వర్గం వేరుగా నిర్మించాలనే ఉద్దేశం కలిగి ఉంది.
ఈ వివాదం నేపథ్యంలో గ్రామంలో ఒక సభ నిర్వహించారు, ఇందులో తాడ్వాయి మండల తహసిల్దార్ రహీమొద్దీన్, ఎస్సై వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఎమ్మార్వో మాట్లాడుతూ, అప్పటి ప్రభుత్వంలో ఎస్సీలకు 60, బీసీలకు 60 ప్లాట్లు కేటాయించడం జరిగిందని వివరించారు.
ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి, ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.