తిరుమల తిరుపతిలో లడ్డు ప్రసాదం తయారీలో అపవిత్రత ఏర్పడిందని ఆరోపణలు చేస్తున్నాయి.
ఈ ఘటనకు సంబంధించి బాధ్యులను గుర్తించి, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పాయకరావుపేట నియోహాకవర్గం నేతలు డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషద్ అధ్యక్షుడు రామాల శివ నాగేశ్వరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.
పాండురంగ స్వామి ఆలయం నుండి ఈ బారీ నిరసన కార్యక్రమం చేపట్టారు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ముఖ్య అతిధిగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు తోట నగేష్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
తోట నగేష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం హిందూ మతాన్ని అవమానించడమే కాకుండా, తిరుమల ప్రతిష్టను కూడా దెబ్బతీసింది.
తిరుమల లడ్డు విషయంలో తీసుకున్న చర్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషద్ నాయకులు, కార్యకర్తలు మరియు అనేక భక్తులు పాల్గొన్నారు, వారు ఈ సమస్యపై చర్చలు జరిపారు.