గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావ్, రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తోందని తెలిపారు.
రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోపు వారి ఖాతాలకు సొమ్ము జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
వారి పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన చెప్పారు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా గ్రామ ప్రజలకు మంచి సేవలు అందించడానికి కట్టుబడి ఉన్నారు.
మంగళవారం ఆయన నూతనంగా నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాన్ని ప్రారంభించారు.
ఇది రూ.8.75 లక్షల మేర నిధులతో నిర్మించబడింది, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
అంతేకాకుండా, రైతుల కోసం నిర్మించిన రూ.23.94 లక్షల రూపాయల రైతు సేవా కేంద్రాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ కేంద్రాలు రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించడంలో సహాయపడతాయన్నారు.
రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు.
నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించడం ద్వారా వ్యవసాయ విధానాలను ఆధునికీకరించడంలో సహాయపడుతుందని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అని యార్లగడ్డ చెప్పారు.
ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు మంచి వైద్యం అందించడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడిందని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికొదలిపిందని ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేసిందని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.