రఘురామకృష్ణరాజు పై చర్యలు తీసుకోవాలని దళిత నాయకుల నిరసన

అంబేడ్కర్ ఫ్లెక్సీని చించివేసిన ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పై చర్యలు తీసుకోవాలని దళిత ప్రజాసంఘాలు పి.గన్నవరం లో నిరసన చేపట్టాయి. అంబేడ్కర్ ఫ్లెక్సీని చించివేసిన ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పై చర్యలు తీసుకోవాలని దళిత ప్రజాసంఘాలు పి.గన్నవరం లో నిరసన చేపట్టాయి.

ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అంబేద్కర్ ఫ్లెక్సీ చించివేసిన ఘటనపై పి.గన్నవరం దళిత నాయకులు నిరసన తెలిపారు.

పి.గన్నవరం మూడు రోడ్ల కూడలిలో జరిగిన ఈ నిరసనలో అంబేడ్కర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అయినవిల్లి జడ్పిటిసి గన్నవరపు శ్రీనివాసరావు రఘురామకృష్ణరాజుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రఘురామకృష్ణరాజు గత ప్రభుత్వంలో ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా ప్రజలకు న్యాయం చేయలేదని శ్రీనివాసరావు విమర్శించారు.

అంబేద్కర్ ఫ్లెక్సీని చించడం బాధాకరమని, ఆయనపై చర్యలు తీసుకోవాలని గట్టిగా నిలదీశారు.

రఘురామకృష్ణరాజు చిత్రపటాలను ప్రజలు నిరసనగా దహనం చేసి, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

తహసిల్దార్ కార్యాలయం మరియు పోలీస్ స్టేషన్ వద్ద వినతిపత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో రామ్మోహనరావు, వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *