కర్నూలు జిల్లా కోసిగి మండలంలో, మంత్రి టిడిపి ఇన్చార్జ్ రాఘవేందర్ రెడ్డి, దుద్ది గ్రామంలో ఏర్పాటు చేసిన “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు సంక్షేమ ఫలాలు అందించడంలో విశేషంగా సఫలమయ్యారని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే గ్రామసభలను ఏర్పాటు చేయడం, పింఛన్లను పెంచడం వంటి చర్యలు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేశాయని పేర్కొన్నారు.
7000 రూపాయలు అందించడం చంద్రబాబుకి మరింత పేరును అందించిందని అన్నారు.
రాధవేందర్ రెడ్డి, సూపర్ సిక్స్ పథకాల అమలు గురించి ప్రజలకు స్పష్టంగా వివరిస్తూ, ప్రభుత్వ ప్రగతి గురించి అవగాహన కల్పించేందుకు కరపత్రాలు పంపిణీ చేశారు.
ప్రతి ఇంటింటా తిరుగుతూ ప్రజలకు ప్రభుత్వ పథకాల లాభాలు వివరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ముత్తారెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి, వక్రాని వెంకటేశులు, అయ్యన్న నర్సారెడ్డి, టిడిపి కార్యకర్తలు, ప్రజలు మరియు వివిధ శాఖాధికారులు పాల్గొన్నారు.
గ్రామంలో ప్రభుత్వం చేస్తున్న పనులు ప్రజల మధ్య మంచి ప్రచారం పొందుతున్నాయి.