తాజాగా కురిసిన భారీ వర్షాలతో ఇల్లు కూలి రోడ్డున పడిన వికలాంగురాలికి శేరిపల్లి యువకులు దాతల సహాయంతో ఇల్లు నిర్మించారు.
గ్రామ యువకులు, నాయకులు కలిసి వితంతువు భాగ్య లక్ష్మి కుటుంబానికి కొత్త ఇల్లు నిర్మించి ఆదర్శంగా నిలిచారు. ఈ చర్యపై గ్రామస్థులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
భాగ్య లక్ష్మి, వితంతువు, వికలాంగురాలు, రెండువురి కుమారులు మానసిక వైకల్యం కలవారు. ఆమె ఇల్లు కూలడంతో గ్రామస్థులు తాత్కాలికంగా పాఠశాలలో ఆశ్రయం కల్పించారు.
యువకులు బాలకృష్ణ గౌడ్, గోవర్ధన్, నర్సింలు గౌడ్ ల ఆధ్వర్యంలో దాతల సహకారంతో కొత్త ఇల్లు నిర్మించి, శనివారం గృహప్రవేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, బాధితులకు సాయం చేయాలని, సన్మార్గంలో నడవాలని సూచించారు.
గోవర్ధన్, నర్సింలు గౌడ్ లు యువతను సన్మార్గంలో నడుస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలిచేందుకు ఈ ప్రయత్నం గొప్పదని పేర్కొన్నారు.
అభాగ్యురాలి ఇంటి నిర్మాణానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. మిగతా వారు కూడా ఇలాంటివారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
తమ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని, గ్రామ యువకులు చేసిన సేవ స్ఫూర్తిదాయకమని గ్రామ నాయకులు అన్నారు.