విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో గురువారం స్కూటీపై అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకొని అరెస్టు చేసినట్లు గజపతినగరం సబ్ ఇన్స్పెక్టర్ కె. లక్ష్మణరావు తెలిపారు. మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 146 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అక్రమ మద్యం, గంజాయి తరలిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గజపతినగరంలో స్కూటీపై అక్రమ మద్యం రవాణా, 146 సీసాల స్వాధీనం….
