జగ్గంపేట ఎంపీడీవో కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛత హై సేవా కార్యక్రమం ప్రారంభమైంది.జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కార్యక్రమాన్ని ప్రారంభించి, పారిశుద్ధ్య సిబ్బందికి యూనిఫామ్లు అందజేశారు.కార్యక్రమం ప్రారంభంలో జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.వైస్ ఎంపీపీ కోరుపల్లి నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో 15 రోజులపాటు ఈ కార్యక్రమం ఎలా నిర్వహించాలో చర్చించారు.సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహించాల్సిన విధానాలపై సుదీర్ఘంగా సమీక్ష జరిగింది.ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్వచ్ఛత కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని కరపత్రాలు ముద్రించి ప్రతి ఇంటికి సచివాలయ సిబ్బంది అందజేయాలని ఆయన సూచించారు.కార్యక్రమంలో ఎస్.వి.ఎస్. అప్పలరాజు, కొత్త కొండబాబు, వమ్మి రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.
జగ్గంపేటలో స్వచ్ఛత హై సేవా కార్యక్రమం ప్రారంభం
