సంగాయిపేట చెరువుల కాలుష్యంపై మత్స్యకారుల ఆందోళ

మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని సంగాయిపేట గ్రామంలో చెరువులు కలుషితం అవుతున్నాయని మత్స సహకార సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని సంగాయిపేట గ్రామంలో చెరువులు కలుషితం అవుతున్నాయని మత్స సహకార సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు.

మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని సంగాయిపేట గ్రామంలో చెరువులు కలుషితం అవుతున్నాయని మత్స సహకార సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు.

గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రతిరోజు చెత్తను డంపు యార్డ్ కు తరలించకుండా చెరువు పరిసరాల్లో వేయడం వల్ల నీరు కలుషితమై చేప పిల్లలు మృతి చెందుతున్నాయని వారు తెలిపారు.

చెరువుల పక్కన చెత్త వేయడం వల్ల చేపల జీవన పరిస్థితులు దెబ్బతింటున్నాయని మత్సకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామంలో డంపు యార్డ్ ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల సమస్య మరింత తీవ్రమైందని ఆరోపిస్తున్నారు.

చెరువు నీటి కాలుష్యంతో గ్రామస్తుల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

అధికారులను వెంటనే ఈ సమస్యపై స్పందించి, చెత్తను చెరువు వద్ద కాకుండా డంపు యార్డ్ కు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని మత్సకారులు విజ్ఞప్తి చేశారు.

స్థానిక మత్స్యకార సంఘం ప్రతినిధులు చెరువుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కాలుష్యాన్ని నివారించేందుకు అధికారులు పటిష్ట చర్యలు తీసుకుని గ్రామ ప్రజలకు మంచినీటి సరఫరా మెరుగుపర్చాలని వారు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *