ఆంధ్రప్రదేశ్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తూ, బద్వేల్ పూలే విగ్రహం వద్ద DYFI ప్రజా సంఘాల నాయకులు ఆందోళన చేశారు.
DYFI పట్టణ అధ్యక్షులు ఎస్కే షరీఫ్, కార్యదర్శి ఎస్.కె అదిల్ నాయకత్వంలో ఈ ఆందోళన జరిగింది. వారు ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించారు.
DYFI నాయకులు మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ప్రోత్సహించడం అన్యాయం అని పేర్కొన్నారు.
కేంద్ర స్టీల్ మంత్రి 45 రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటికే మూడు నెలలు దాటినా ఏ పరిష్కారం తీసుకోకపోవడం అన్యాయం అని విమర్శించారు.
ఈ ఆందోళనలో పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులు, స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడం వల్ల స్థానిక ఉద్యోగులు, ప్రజలు తీవ్రంగా నష్టపోతారని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా మరింత కఠిన ఆందోళనలు చేపట్టాల్సిన అవసరం ఉందని DYFI నాయకులు హెచ్చరించారు.
ఆందోళనలో పాల్గొన్న ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో ఒకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.
DYFI నాయకులు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, నిరసనలను ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరించారు.