తమిళంలో ‘ఇరుల్’ మిస్టరీ థ్రిల్లర్

ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నసీఫ్ యూసఫ్ దర్శకత్వం వహించిన మలయాళ థ్రిల్లర్ 'ఇరుల్,' సెప్టెంబర్ 6న ఆహా తమిళ్‌లో స్ట్రీమింగ్. తమిళంలో 'ఇరుల్' మిస్టరీ థ్రిల్లర్

మలయాళ హారర్ థ్రిల్లర్ సినిమాలకు .. అలాగే అక్కడి క్రైమ్ థ్రిల్లర్ .. మిస్టరీ థ్రిల్లర్ సినిమాల పట్ల ఇతర భాషా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని చూపుతుంటారు. అందువలన ఎప్పటికప్పుడు ఈ తరహా కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి ఓటీటీ సంస్థలు పోటీపడుతూ ఉంటాయి. అలా ఓటీటీ తెరపైకి వస్తున్న మరో మిస్టరీ థ్రిల్లర్ ‘ఇరుల్’. 

మలయాళంలో రూపొందిన ఈ సినిమాకి నసీఫ్ యూసఫ్ ఇజుద్దీన్ దర్శకత్వం వహించాడు. ఆంటోని జోసఫ్ నిర్మించిన ఈ సినిమాకి, శ్రీరాగ్ సాజీ సంగీతాన్ని సమకూర్చాడు. ఫహాద్ ఫాజిల్ .. దర్శనా రాజేంద్రన్ .. సౌబిన్ షాహిర్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, 2021 ఏప్రిల్ 2న ఓటీటీ ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా ఇప్పుడు ఆహా తమిళ్ ఓటీటీ లో అడుగుపెడుతోంది. 

ఆహా తమిళంలో ఈ సినిమాను ఈ నెల 6వ తేదీనుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. ఇదే నెలలో తెలుగులోను ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రానున్నారు. మూడే మూడు ప్రధానమైన పాత్రల చుట్టూ తిరగడం ఈ కథలోని ప్రత్యేకత.

కథలోకి వెళితే .. ఒక రచయిత తన ప్రియురాలితో కలిసి సరదాగా కారులో ఒక ట్రిప్ వేస్తాడు. ఒక అటవీ ప్రాంతంలో ఆ కారు ట్రబుల్ ఇస్తుంది. దాంతో ఇద్దరూ అయోమయంలో పడిపోతారు. సాయం కోసం చుట్టూ చూస్తున్న వారికి దూరంగా ఒక ఇల్లు కనిపిస్తుంది. దాంతో ఇద్దరూ ఆ ఇంటికి వెళతారు. ఆ ఇల్లు ఎవరిది? అక్కడ ఏం జరుగుతుంది? అనేది కథ. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *