సెల్ఫీ మోజులో ప్రాణాంతక ఘటన

సెల్ఫీ మోజులో ప్రాణాంతక ఘటన

సెల్ఫీ మోజు ఓ మ‌హిళ ప్రాణాల‌మీద‌కు తెచ్చింది. సెల్ఫీ దిగే క్ర‌మంలో ప్ర‌మాద‌వ‌శాత్తు కాలుజారి కాలువ‌లో ప‌డింది. న‌ల్గొండ జిల్లా వేముల‌ప‌ల్లి మండ‌ల కేంద్రంలోని నాగార్జున సాగ‌ర్ ఎడ‌మ కాలువ వ‌ద్ద శుక్ర‌వారం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. వెంట‌నే స్పందించిన స్థానికులు మ‌హిళ‌ను ప్రాణాల‌తో కాపాడారు. 

స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… హైద‌రాబాద్ నుంచి మిర్యాల‌గూడ వైపు వెళుతున్న ఓ కుటుంబం వేముల‌ప‌ల్లి మండల కేంద్రంలోని నాగార్జున సాగ‌ర్ ఎడ‌మ‌కాలువ వ‌ద్ద ఆగింది. అనంత‌రం ఆ కుటుంబం కాలువ వ‌ద్ద సెల్ఫీ దిగింది. ఈ క్ర‌మంలో ఆ ఫ్యామిలీలోని ఓ మ‌హిళ కాలు జారి కాలువ‌లో ప‌డిపోయింది. 

అది చూసిన స్థానికులు వెంట‌నే స్పందించి మ‌హిళ‌ను తాళ్ల సాయంతో కాపాడారు. మ‌హిళ సుర‌క్షితంగా పైకి రావ‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు. దీంతో కొద్దిసేపు కాలువ వ‌ద్ద ఆందోళనకర వాతావర‌ణం నెల‌కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *