ఇండ్ల ఓబులేసు రాష్ట్ర అధ్యక్షులు, బద్వేల్ ఏరియా అధ్యక్షులు గొడుగునూరు బాలరాజు, వికలాంగుల నిరుద్యోగుల విభాగం బద్వేల్ ఏరియా అధ్యక్షులు సత్యం,ఈ సందర్భంగా మాట్లాడుతూ బద్వేల్ ఏరియాలో దాదాపు 3 వేలకు పైగా వికలాంగులు ఉన్నారు ఇందులో 2000 మంది పైగా వికలాంగులు నిరుద్యోగులుగా ఉన్నారు ప్రభుత్వం నుండి ఉపాధి గాని ఉద్యోగ అవకాశాలు లేక ఇతర పనులు చేసుకోలేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది ప్రభుత్వం తక్షణమే వికలాంగులకు ఉపాధి ఉద్యోగాలు కల్పించాలని వారు కోరారు.
బద్వేల్ పట్టణం రోజురోజుకు అభివృద్ధి అవుతున్న క్రమంలో వికలాంగులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉన్నారు . బద్వేలులో ప్లే వుడ్ పరిశ్రమ రాజకీయ ప్రలోభాలకు కారణమైపోయింది రాజకీయ నాయకుల ఆదేశాల మేరకు అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వటం అనేది సరికాదన్నారు నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో కంపెనీ పూర్తి బాధ్యతగా ఉండాలని అంతేగాని ఎవరికో రాజకీయ రేకమండేషన్లు ద్వారా ఉద్యోగాలు ఉపాధి ఇవ్వటం వారు ఖండించారు వికలాంగుల అర్హతను బట్టి వారి శక్తి సామర్థ్యాలను బట్టి వారికి ఉపాధి ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు లేని పక్షంలో వికలాంగులందరినీ ఏకం చేసి నిరుద్యోగుల వికలాంగుల విభాగం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని వారు హెచ్చరించారు ఇప్పటికే అనేక మందిని ఉన్నపలంగా తీసేస్తున్నారన్న వార్త చాలా బాధాకరం వేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు మాకు న్యాయమైన సమస్యకు పరిష్కారం చేయకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులు ఇండ్ల ఓబులేసు రాష్ట్ర అధ్యక్షులు, బద్వేల్ ఏరియా అధ్యక్షులు గొడుగునూరు బాలరాజు, వికలాంగుల నిరుద్యోగుల విభాగం బద్వేల్ ఏరియా అధ్యక్షులు సత్యం, బి కోడు మండల కన్వీనర్ మోహన్ రెడ్డి, బి మఠం మండల కన్వీనర్ మునీంద్ర తదితరులు పాల్గొన్నారు.