విజయవాడ నడిబొడ్డున గల డా॥ బాబా సాహెబ్ అంబేద్కర్ “సామాజిక మహా శిల్పంపై” దాడిని ఖండించిన రాజాం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇంచార్జి డా. తలే.రాజేష్ .
ప్రభుత్వం అధినేత చంద్రబాబు హయాంలో పాలన గాడి తప్పి అహింసకు ఆవాసంగా ఆంధ్ర రాష్ట్రం నిలుస్తూ ప్రజా పరిపాలనకు పాతరేసి ప్రజలకిచ్చిన హామీలను గాలికి వదిలేశారు – డా. తలే.రాజేష్ .
_▫️స్వయానా భారత రాజ్యాంగ నిర్మాతపై దాడి జరగడం ఈ దాడిని ఒక సామాజిక దళిత హోంమంత్రి ఖండించకపోవడం నిజంగా దౌర్భాగ్యం.
రాజాం టౌన్: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, కూటమి ప్రభుత్వం నిన్న రాత్రి విజయవాడ నడిబొడ్డున గల అంబేద్కర్ గారి విగ్రహ శిలా ఫలకాన్ని సుత్తులతో, ఇతర పరికరాలతో దాడి చేసిన ఘటనకు నిరసనగా నేడు రాజాం నియోజకవర్గ కేంద్రంలో రాజాం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇంచార్జి డా. తలే.రాజేష్ గారి సారధ్యంలో పార్టీ శ్రేణులతో కలిసి చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా స్థానికంగా అంబేద్కర్ కూడలి వద్ద గల డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూల మాలలు వేసి జోహార్లు అర్పిస్తూ గత రాత్రి ఎన్డీయే ప్రభుత్వం ప్రోద్బలంతో కొందరు తెలుగుదేశం దుష్ట శక్తుల అల్లరి మూకలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహా శిల్పంపై దాడికి తెగపడిన ఘటనతో యావత్ భారతదేశ దళిత సమాజం నివ్వెరపోయెలా చేసింది అని, ఈ దుచ్చర్యను వైసిపి పార్టీ ఖండిస్తుంది అని ఇది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి జరిగిన అవమానంగా భావిస్తూ నేడు యావత్ రాష్ట్రంతో పాటు మన నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి పాలభిషేకం చేసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగినది అని డా. తలే.రాజేష్ మీడియాకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాజాం టౌన్ కన్వీనర్ పాలవలస.శ్రీనివాసరావు , రూరల్ కన్వీనర్ లావేటి. రాజగోపాల్ నాయుడు ,ZPTC బండి.నరసింహులు ,PACS అధ్యక్షులు వాకముల్ల.చిన్నం నాయుడు , వైస్ ఎంపీపీ యాలాల.వెంకటేష్ ,దూబ.గోపాలం ,నియోజకవర్గ JCS కన్వీనర్ పాలవలస.రాజగోపాల్ ,మరియు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు,కార్యకర్తలు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు