బద్వేల్ పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇల్లు స్థలాలు ఇవ్వాలని స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది.
ఈ ధర్నాని ఉద్దేశించి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ గాలి చంద్ర మాట్లాడుతూ
బద్వేల్ పట్టణంలో గత ఐదారు నెలలుగా ఇల్లు లేని నిరుపేదలు గుడిసెలు నిర్మాణం చేసుకొని కరెంటు లేకపోయినా నీళ్ళు లేకపోయినా చిమ్మ చీకటిలో పేదల నివాసం ఉంటుంటే వారిపైన అధికారులు ఉక్కు పాదం మోపడం సరైనది కాదని
బద్వేల్ నియోజకవర్గంలో వందలాది ఎకరాలు కబ్జాదారులు ఆక్రమించి కంచెలు వేసుకుని కోట్లాది రూపాయలు అమ్ముకుని సొమ్ము చేసుకుంటా ఉంటే రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు.
కబ్జా దారులను వదిలిపెట్టి పేదల గుడిసెలను కూల్చివేస్తాం కాల్చివేస్తాం పీకేస్తాం అంటే మాత్రం కమ్యూనిస్టు పార్టీ చూస్తూ ఊరుకోదని ఎంతటి ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉంటామని పేదల పక్షాన నిలబడి పేదల కోసం ఎంతటి ఉద్యమమైన చేస్తామని చెప్పి ఆయన అన్నారు