కాకినాడ జిల్లా, తుని మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలలో డి పోలవరం గ్రామానికి చెందిన బర్ల గోవిందు హై స్కూల్ చైర్మన్ గా సామల కృష్ణ ఎంపీపీ ఎస్ 2 స్కూలు చైర్మన్గా పారుపల్లి మురళి ఎంపీ యూపీ స్కూల్ చైర్మన్గా టిడిపి పార్టీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ పలక సోమేశ్వరావు ఇరు వర్గాలను సమైక్యపరిచి వ్యూహ కర్త గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణుడు, స్థానిక శాసన సభ్యురాలు యనమల దివ్య ఆదేశాలు మేరకు గ్రామ నాయకులంతా ఏకదటిపై పనిచేసి విద్యాపరంగా పాఠశాలకు అవసరమగు మౌలిక వసతులకు మా పై నాయకుల సలహాల మేరకు సమకూర్చుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో అలమండ వెంకటరమణ, వడబోయిన సాంబయ్య, పెను పోతుల నూకరాజు, సుర్ల చిట్టిబాబు, సుర్ల నానాజీ , అంకం రెడ్డి రమేష్ , చింతల నాయుడు, ఎడగాల నాగరాజు, మిర్యాల రమణ పాల్గొన్నారు.