JEE Main Admit Card 2026 Released: జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 హాల్‌టికెట్లు విడుదల

jee main 2026 admit card download online jee main 2026 admit card download online

JEE Main 2026 Update: జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 (JEE Main 2026) పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. జనవరి 21, 22, 23, 24 తేదీల్లో నిర్వహించనున్న పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 పరీక్షలు జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో జరగనున్నాయి. అలాగే పేపర్‌-2 పరీక్షను జనవరి 29న నిర్వహించనున్నారు.

ప్రస్తుతం తొలి నాలుగు రోజుల పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను మాత్రమే విడుదల చేయగా, మిగతా తేదీలకు సంబంధించిన హాల్‌టికెట్లను తరువాత విడుదల చేయనున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది.

ఈ పరీక్షలు రోజుకు రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. మొదటి షిఫ్టు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్టు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది.

అభ్యర్థులు తమ అడ్మిట్‌ కార్డులో పరీక్ష కేంద్రం, షిఫ్ట్‌, ఇతర వివరాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలని ఎన్‌టీఏ సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *