మౌని అమావాస్యకు ఆ పేరు ఎలా వచ్చింది?..పేరు వెనుక ఆధ్యాత్మిక రహస్యం ఏంటో తెలుసా ?  

mauni amavasya significance mauni amavasya significance

Mauni Amavasya : పుష్య బహుళ అమావాస్యను మౌని అమావాస్యగా పిలుస్తారు. ఇది ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత వచ్చే తొలి అమావాస్య కావడం విశేషం. ఈ రోజున సాధువులు, ఉపాసకులు, యోగులు మౌనవ్రతాన్ని పాటిస్తూ సాధన చేస్తారు.

ఉత్తర దేశంలో మౌనవ్రతానికి ఉన్న ప్రాధాన్యం కారణంగా ఈ అమావాస్యకు ‘మౌని’ అనే పేరు స్థిరపడింది. తపస్సిద్ధిని పొందినవారిని మౌని అని పిలుస్తారు.

ఈ రోజున సముద్ర స్నానం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. త్రివేణి సంగమం, గోదావరి వంటి జీవనదుల్లో స్నానం చేయడం ద్వారా పాపనాశనం జరుగుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

ASLO READ:CHat GPT  యూజర్లకు షాక్…..ఓపెన్‌ఏఐ కీలక నిర్ణయం..త్వరలో ప్రకటనలు ?

గౌతమ మహర్షి తపస్సు ఫలంగా ఏర్పడిన గోదావరి ఏడుపాయలుగా విభజించి సముద్రంలో కలిసిన ఏడు సంగమ స్థలాల్లో స్నానం చేయడాన్ని సప్తసాగర యాత్రగా భావిస్తారు. ఈ యాత్ర పుష్య బహుళ అమావాస్య నాడు చొల్లంగి వద్ద పూర్తవుతుండటంతో దీనిని చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు.

ఈ సంవత్సరం ఆదివారం అమావాస్య రావడం వల్ల సూర్యానుగ్రహం మరింతగా లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. జాతకంలో గ్రహదోషాలు ఉన్నవారు ఈ రోజున సూర్యారాధన, అర్ఘ్యప్రదానం చేయడం వల్ల కుజ, రాహుకేతు దోషాలు తొలగి ఆరోగ్యం, శాంతి లభిస్తాయని విశ్వాసం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *