India vs Bangladesh U19: జింబాబ్వే బులేవాయో వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 2026లో భారత్ – బంగ్లాదేశ్ మ్యాచ్ ఆసక్తికర మలుపు తిరిగింది. మ్యాచ్ ప్రారంభానికి ముందే మైదానంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
బంగ్లాదేశ్ కెప్టెన్ గైర్హాజరు
బంగ్లాదేశ్ రెగ్యులర్ కెప్టెన్ అజీజ్ హకీం తమీమ్ అనారోగ్య కారణాలతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో వైస్ కెప్టెన్ జవాద్ అబ్రార్ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.
టాస్ దగ్గరే అసాధారణ పరిస్థితి
టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. సాధారణంగా టాస్ అనంతరం ఇద్దరు కెప్టెన్లు చిరునవ్వుతో షేక్‌హ్యాండ్ చేసుకోవడం క్రీడాస్ఫూర్తికి ప్రతీక. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం ఆ సీన్ కనిపించలేదు.
ముఖాముఖీ అయినా పలకరింపు లేదు
భారత కెప్టెన్ ఆయుష్ మ్హత్రే, బంగ్లాదేశ్ కెప్టెన్ జవాద్ అబ్రార్ పక్కపక్కనే నిలబడ్డప్పటికీ ఒకరినొకరు పలకరించలేదు. కనీసం కంటి చూపు కూడా కలవలేదు. షేక్‌హ్యాండ్ లేకుండానే అబ్రార్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
జాతీయ గీతం సమయంలోనూ కొనసాగిన ఉద్రిక్తత
ఈ ఉద్రిక్త వాతావరణం టాస్‌తోనే ఆగిపోలేదు. జాతీయ గీతం ఆలపించే సమయంలో, ఆటగాళ్లు మైదానంలోకి ప్రవేశించే వేళ కూడా ఇరు జట్ల మధ్య దూరం స్పష్టంగా కనిపించింది.
క్రీడా ప్రపంచంలో అరుదైన దృశ్యం
బౌండరీ లైన్ వద్ద ఆటగాళ్లు ఎదురుపడ్డా మాటామంతీ లేకపోవడం చర్చనీయాంశమైంది. భారత్ – బంగ్లాదేశ్ జట్ల మధ్య ఈ టెన్షన్ క్రీడా ప్రాధాన్యతలో అరుదైన సంఘటనగా నిలిచింది.
