Silver Rates Today: వెండి కొనే వారికీ షాక్. తగ్గినట్లే తగ్గి మళ్ళీ పుంజుకున్న వెండి ధరలు మళ్లీ భారీగా పెరిగి బులియన్ మార్కెట్‌లో కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి.
ఇటీవల రూ.3 లక్షల మార్కును దాటిన వెండి ధర మరోసారి రికార్డ్ దిశగా దూసుకెళ్తోంది. కనుమ రోజున స్వల్పంగా తగ్గిన వెండి ధర, ఈ రోజు ఒక్కసారిగా భారీగా పెరిగింది.
ఈ రోజు కిలో వెండి ధర రూ.3,000 పెరిగి దేశీయ బులియన్ మార్కెట్‌లో రూ.2,95,000 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్, చెన్నై నగరాల్లో కిలో వెండి ధర రూ.3,10,000కు చేరగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో రూ.2,95,000 వద్ద కొనసాగుతోంది.
ఇక బంగారం ధరలలో కూడా పెరుగుదల నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.380 పెరిగి రూ.1,43,780 వద్ద ట్రేడ్ అవుతోంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 పెరిగి రూ.1,31,800గా నమోదైంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.290 పెరిగి రూ.1,07,840 వద్ద కొనసాగుతోంది.
నగరాల వారీగా బంగారం, వెండి ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ధోరణులు, డాలర్ మార్పిడులు, పెట్టుబడుల డిమాండ్ పెరగడం వల్ల బులియన్ ధరలు ఎగబాకుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
వరుసగా పెరుగుతున్న ధరలతో వెండి, బంగారం మార్కెట్‌లో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
