West Bengal Coal Mine: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అసన్సోల్ ప్రాంతంలో బొగ్గు గనిలో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. బోర్డిలా పరిసరాల్లో ఉన్న గని అకస్మాత్తుగా కూలిపోవడంతో అక్కడ పని చేస్తున్న పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారని సమాచారం.
ఘటన విషయం తెలియగానే పోలీసులు, సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు.
ప్రస్తుతం శిథిలాలను తొలగిస్తూ కార్మికులను బయటకు తీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే గనిలో మొత్తం ఎంతమంది కార్మికులు ఉన్నారన్న పూర్తి వివరాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
ALSO READ:Quick Commerce | 10 నిమిషాల డెలివరీకి బ్రేక్?.. క్విక్ కామర్స్ సంస్థల కీలక నిర్ణయం
ఈ ఘటనతో కార్మికుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రమాదానికి గురైన గని అక్రమ మైనింగ్‌కు సంబంధించినదిగా అధికారులు గుర్తించారు. అనుమతి లేకుండా జరుగుతున్న తవ్వకాల కారణంగానే గని ఒక్కసారిగా కూలిపోయినట్లు తెలుస్తోంది.
పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భారీ యంత్రాలను రంగంలోకి దింపి సహాయక చర్యలను వేగవంతం చేశారు.
ఈ ఘటనపై ఉన్నతాధికారులు సమీక్ష చేపట్టగా, రెస్క్యూ పనులు పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
