Bank Holidays 2026: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం, 2026 జనవరి నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు మొత్తం 15 రోజులు సెలవులు ఉండనున్నాయి. ఈ సెలవుల్లో జాతీయ పండుగలు, రాష్ట్రస్థాయి పండుగలు, అలాగే ఆదివారాలు, రెండో మరియు నాలుగో శనివారాలు కూడా ఉన్నాయి.
రాష్ట్రాలవారీగా సెలవుల్లో తేడా
అయితే, ఈ బ్యాంక్ సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండవని ఆర్బీఐ స్పష్టం చేసింది. స్థానిక పండుగలు, ప్రాంతీయ సంప్రదాయాల ఆధారంగా రాష్ట్రాలవారీగా సెలవుల తేదీల్లో మార్పులు ఉంటాయి.
జనవరి 2026 నెలలో బ్యాంక్ సెలవులు (DATES)
జనవరి 1: న్యూ ఇయర్ డే / గాన్-న్గై
జనవరి 2: న్యూ ఇయర్ వేడుకలు / మన్నం జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు
జనవరి 12: స్వామి వివేకానంద జయంతి
జనవరి 14: మకర సంక్రాంతి / మాఘ్ బిహు
జనవరి 15: ఉత్తరాయణ పుణ్యకాలం / పొంగల్ / మాఘే సంక్రాంతి
జనవరి 16: తిరువళ్లువర్ డే (తమిళనాడు)
జనవరి 17: ఉజవర్ తిరునాళ్
జనవరి 23: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి / సరస్వతీ పూజ
జనవరి 26: రిపబ్లిక్ డే (జాతీయ సెలవు)
ALSO READ:Betting Apps Case | సీఐడీ ఎంక్వయిరీ క్లోజ్.. తదుపరి చర్యలు ఏంటి?
వారాంతాల్లో బ్యాంకులకు సెలవులు
జనవరి 4, 11, 18, 25 (ఆదివారాలు)
జనవరి 10 (రెండో శనివారం), జనవరి 24 (నాలుగో శనివారం)
ఆన్‌లైన్ సేవలు కొనసాగుతాయి
బ్యాంక్ బ్రాంచ్‌లు మూసివున్నప్పటికీ, UPI, NEFT, IMPS, మొబైల్ & ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు నిరంతరంగా అందుబాటులో ఉంటాయి. చెక్ క్లియరెన్స్, లోన్ చెల్లింపులు వంటి లావాదేవీలు ముందుగానే ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
