PM Modi – Luxon: భారత్–న్యూజిలాండ్ మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ఖరారైంది. ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్‌తో టెలిఫోన్‌లో సంభాషించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పరస్పర ప్రయోజనాలకు దోహదపడే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విజయవంతంగా కుదిరినట్లు నేతలిద్దరూ సంయుక్తంగా ప్రకటించారు.
సుమారు తొమ్మిది నెలల పాటు సాగిన చర్చల అనంతరం ఈ ఒప్పందం తుది రూపం దాల్చినట్లు వెల్లడించారు. ఈ ఏడాది మార్చిలో న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ భారత పర్యటన సందర్భంగా జరిగిన చర్చలు ఇప్పుడు ఫలితాన్ని ఇచ్చినట్లు తెలిపారు.
ALSO READ:చదువుకునే చేతులతో రాజకీయాలు చేయించొద్దు…రప్పా రప్పా ప్లెక్సీలపై హోంమంత్రి ఆగ్రహం
ఈ ఒప్పందం ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాల పెరుగుదలకు దోహదపడుతుందని ఇరు దేశాల నాయకులు అభిప్రాయపడ్డారు.
రాబోయే 15 ఏళ్లలో న్యూజిలాండ్ నుంచి భారత్‌లో సుమారు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
విద్య, యువత, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. ఫోన్ సంభాషణ అనంతరం న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ సోషల్ మీడియా వేదికగా ఈ ఒప్పందం ఖరారైన విషయాన్ని వెల్లడించారు.
