Avatar 3 Promotions | ‘వారణాసి’ సెట్‌కు రావాలని ఉంది: జేమ్స్ కామెరూన్

James Cameron and SS Rajamouli during Avatar 3 promotional interview James Cameron and SS Rajamouli during Avatar 3 promotional

Avatar 3 Promotions: ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న జేమ్స్ కామెరూన్ చిత్రం అవతార్: ఫైర్ అండ్ యాష్’ (Avatar 3) బిగ్ స్క్రీన్ అనుభూతికి కొత్త ప్రమాణాలు నెలకొల్పనుందని దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli)ప్రశంసించారు.

‘అవతార్ 3’ (Avatar 3) ప్రమోషన్స్‌లో భాగంగా జేమ్స్ కామెరూన్–రాజమౌళి మధ్య జరిగిన స్పెషల్ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.

ALSO READ:Gujarat Bomb Threats | అహ్మదాబాద్‌లో పాఠశాలలకు బెదిరింపు ఈమెయిల్స్


ఈ ఇంటర్వ్యూలో కామెరూన్ మాట్లాడుతూ, మూడో భాగంలో పండోరా గ్రహంపై కొత్త తెగలు, కొత్త సంస్కృతి, నిప్పు–బూడిద నేపథ్యంతో సాగే సంఘర్షణ ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలిపారు. ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా రూపొందించామని వెల్లడించారు.

ఇదే సందర్భంలో రాజమౌళి సినిమాటిక్ ఆలోచన విధానాన్ని కామెరూన్ ప్రశంసించారు. రాజమౌళి తెరకెక్కించనున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ ప్రాజెక్ట్ గురించి తనకు తెలుసని, ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో స్వయంగా సెట్‌కు వచ్చి చూడాలనుకుంటున్నానని చెప్పారు.

అవకాశం వస్తే కలిసి పని చేయాలన్న కోరికను కూడా వ్యక్తం చేశారు. దీనికి రాజమౌళి స్పందిస్తూ, “మీరు ఎప్పుడైనా మా సెట్‌కు రావచ్చు. అది మా అదృష్టం” అంటూ కామెరూన్‌కు ఆహ్వానం పలికారు. ఈ ఇద్దరు దిగ్గజ దర్శకుల సంభాషణ సినీ అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *