Ratan Tata Road | ఫ్యూచర్ సిటీకి 8-లేన్ హైవే నిర్మాణం పనులు  ప్రారంభం

Aerial view of the Ratan Tata Road greenfield highway construction route in Telangana Aerial view of the Ratan Tata Road greenfield highway construction route in Telangana

Telangana News: హైదరాబాద్‌ను ‘భారత్ ఫ్యూచర్ సిటీ’తో అనుసంధానం చేసే కీలకమైన “రతన్‌టాటా రోడ్డు”(Ratan Tata Road) నిర్మాణ పనులు తెలంగాణలో ప్రారంభమయ్యాయి. 300 అడుగుల 100 Meters వెడల్పుతో రూపొందుతున్న ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే మొత్తం 41.50 కిలోమీటర్ల మేర విస్తరించనుంది.

రావిర్యాల ORR ఎగ్జిట్ 13 నుంచి అమన్‌గల్ వద్ద రీజినల్ రింగ్ రోడ్డు (RRR) వరకు ఈ మార్గం నిర్మించబడుతోంది. మొదట 6 లేన్లుగా నిర్మించే ఈ రహదారిని భవిష్యత్‌లో 8 లేన్లుగా విస్తరించే ప్రణాళిక ఉంది.

ALSO READ:Uttar Pradesh Cough Syrup | దగ్గు సిరప్ అక్రమ రాకెట్‌పై ఈడీ దాడులు..పరారీలో ప్రధాన నిందితుడు 

భారత్ ఫ్యూచర్ సిటీ(Bharat Future City) అభివృద్ధి కోసం కీలకమైన ఈ హైవే కొంగరఖుర్దు, ఫిరోజ్‌గూడ, లేమూర్, పంజగూడ  మీదుగా మీర్‌ఖాన్‌పేట వరకు చేరుతుంది. అక్కడి నుంచి ముచ్చెర్ల, కడ్తాల్, చివరగా అమన్‌గల్ వద్ద  ఆర్ ఆర్ ఆర్ ను కలుస్తుంది.

ఈ ప్రాజెక్ట్ రంగారెడ్డి జిల్లాలోని 6 మండలాలు, 14 గ్రామాలకు నేరుగా అనుసంధానం కానుంది. మొత్తం 916 ఎకరాల భూసేకరణ అవసరమైన ఈ ప్రాజెక్టులో 568 ఎకరాలు పట్టా భూములు.

కొంతమంది రైతులు అంగీకారం తెలపకపోవడంతో అధికారులు ప్రస్తుతం ప్రభుత్వ భూముల్లో మాత్రమే పనులు చేపట్టారు. రైతులు అంగీకారం తెలిపిన తర్వాత మిగతా భూసేకరణ పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *