U19 Asia Cup: ACC పురుషుల అండర్-19 ఆసియా కప్ 2025 తొలి మ్యాచ్‌లో భారత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై దుబాయ్‌లోని ICC అకాడమీ గ్రౌండ్‌లో ఆడిన ఈ మ్యాచ్‌లో వైభవ్ దుమ్ములేపే ఇన్నింగ్స్ ఆడాడు.
ఇన్నింగ్స్ ప్రారంభంలో జాగ్రత్తగా ఆడినా, స్థిరపడిన తర్వాత వరుసగా బౌండరీలు, సిక్సర్లు బాది రన్‌రేట్‌ను పెంచాడు. కేవలం 30 బంతుల్లో అర్ధ సెంచరీ చేరుకున్న అతడు, 56 బంతుల్లో సెంచరీని నమోదు చేశాడు.
ALSO READ:డెడ్ చీప్‌గా T20 World Cup 2026 టికెట్లు…ఎంత అంటే ?
మొత్తం 84 బంతుల్లో 150 పరుగులు పూర్తి చేసి, చివరకు 171 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 14 సిక్సర్లు ఉన్నాయి. ఇది అతని యూత్ వన్డే కెరీర్‌లో అత్యధిక స్కోరు.
ఇంతకుముందు ఇంగ్లాండ్ అండర్-19పై చేసిన 143 పరుగుల రికార్డును అధిగమించాడు. సెంచరీ దిశగా వెళ్లే సమయంలో వైభవ్‌కు రెండు లైఫ్‌లు దక్కాయి. 28, 85 పరుగుల వద్ద UAE ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలేయడంతో అతడు ఇన్నింగ్స్‌ను మరింత భారీగా మలిచాడు.
గతంలో రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో కూడా UAEపై 42 బంతుల్లో 144 పరుగులతో వైభవ్ సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో తాజాగా చేసిన 171 ఇన్నింగ్స్ అతని దూకుడు బ్యాటింగ్‌కు మరో ఉదాహరణగా నిలిచింది.
