Telangana Panchayat Elections: తెలంగాణలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియగా, అనేక గ్రామాల్లో ఒక్క ఓటు తేడా ఫలితాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. మొత్తం 3,836 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరగగా 84.28% ఓటింగ్ నమోదైంది.
ఈ దశలో కాంగ్రెస్(Congress) ఆధిక్యం సాధించగా, బీఆర్ఎస్(Brs) రెండో స్థానంలో నిలిచింది. అయితే నిజమైన చర్చకు విషయం అయినది సింగిల్ ఓట్ మార్జిన్ ఫలితాలు.
also read:Vizag IT investments 2025 | విశాఖలో కొత్త అధ్యాయం….ఐటీ రంగంలో భారీ పెట్టుబడులు
సర్పంచ్ ఎలక్షన్స్ లో గెలిచిన అదృష్టవంతులు
1.కుమురం భీం జిల్లాలోని పరందొలి గ్రామంలో రాథోడ్ పుష్పలత 102 ఓట్లు సాధించి, దిలీప్ పై ఒక్క ఓటుతో విజయం సాధించింది.
2.కామారెడ్డి జిల్లా నడిమి తండాలో బానోత్ లక్ష్మి 290 ఓట్లతో 289 ఓట్లు పొందిన సునీతను ఓడించింది.
3.నిర్మల్ జిల్లా కల్లెడలో రుక్మిణీదేవి మరియు లక్ష్మికి సమాన ఓట్లు వచ్చినా, ఒక చెల్లని ఓటు రుక్మిణీకు విజయం తీసుకొచ్చింది.
4.జనగామ జిల్లా ఎల్లారెడ్డిగూడెంలో తిరిగి లెక్కింపులో చెల్లని ఓటు గుర్తించడం వల్ల జోజి, నర్సయ్యలకు సమాన ఓట్లు వచ్చాయి. డ్రా ద్వారా జోజి గెలుపొందాడు.
5.నిజామాబాద్ జిల్లాలో కల్దుర్కిలో మూడు సార్లు రీకౌంటింగ్ చేపట్టగా, ప్రతి సారి నరేందర్ రెడ్డికే ఆధిక్యం రావడంతో ఆయన సర్పంచ్‌గా ప్రకటించారు.
ఈ ఫలితాలు గ్రామీణ ఎన్నికల్లో ఒక్క ఓటు ఎంత కీలకమో మరోసారి స్పష్టం చేశాయి.
