ICC T20 WC 2026 : 2026 ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్‌కు సంబంధించిన ఫేజ్–1 టికెట్ విక్రయాలు అధికారికంగా ప్రారంభం అయ్యాయి. డిసెంబర్ 11 సాయంత్రం 6.45 గంటల నుంచి టికెట్ బుకింగ్స్ ఓపెన్ కావడంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది.
భారత్‌లో టికెట్ ధరలు కేవలం ‘రూ.100’ నుంచి ప్రారంభమవుతుండగా, శ్రీలంకలో ‘LKR 1000′ (సుమారు రూ.270) నుంచి లభ్యం అవుతున్నాయి. మొదటి విడతలో దాదాపు ’20 లక్షల టికెట్లు’ అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ఫేజ్–2 వివరాలు త్వరలో ప్రకటించనుంది.
ALSO READ:CM Chandrababu | కార్యకర్తలకు దిశానిర్ధేశం..ఆ రెండు ముఖ్యమే
2026 మెగా టోర్నమెంట్ భారత్–శ్రీలంక సంయుక్తంగా ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. వరల్డ్ క్లాస్ క్రికెట్‌ను ప్రతి అభిమానికి చేరువ చేయడమే లక్ష్యమని ఐసీసీ ప్రకటించింది.
తక్కువ ధరకే టికెట్లు అందుబాటులో ఉంచడం వల్ల మరింత మంది అభిమానులు స్టేడియాలలో ప్రత్యక్షంగా మ్యాచ్‌లను వీక్షించగలరని ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా తెలిపారు. క్రికెట్ ప్యాషన్‌కు తగ్గట్లుగా అత్యుత్తమ అనుభవాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నామని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా పేర్కొన్నారు.
శ్రీలంక క్రికెట్ సీఈఓ అష్లీ డి సిల్వా టికెట్ అమ్మకాలు ప్రారంభమైనట్లు ప్రకటిస్తూ వెంటనే బుకింగ్ చేసుకోవాలని సూచించారు. భారత్–శ్రీలంకలోని ఎనిమిది స్టేడియాల్లో మొత్తం ’20 టీమ్స్’, “55 మ్యాచ్‌లు” జరగనున్నాయి.
