ICC ODI Rankings | రెండో స్థానానికి విరాట్‌ కోహ్లీ.. నెంబర్‌ వన్‌గా రోహిత్‌ శర్మ

Virat Kohli and Rohit Sharma in ICC ODI rankings top positions Virat Kohli and Rohit Sharma in ICC ODI rankings top positions

ICC ODI Rankings: ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ(Virat Kohli), రోహిత్‌ శర్మ మరోసారి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు.  సోషల్ మీడియాలో రోకో(RO-KO) హావా నడుస్తుంది అని నీటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నెంబర్‌ వన్‌గా కొనసాగుతున్న రోహిత్‌ శర్మ(Rohit Sharma) తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న విరాట్‌ కోహ్లీ రెండు సెంచరీలు, ఒక హాఫ్‌ సెంచరీతో మొత్తం 302 పరుగులు సాధించాడు. ఈ ప్రదర్శనతో అతడు రెండు స్థానాలు మెరుగుపరుచుకొని రెండో స్థానానికి చేరుకున్నాడు. అగ్రస్థానానికి కేవలం ఎనిమిది రేటింగ్‌ పాయింట్ల దూరంలో ఉన్నాడు.

ALSO READ:Nagpur leopard attack | మహారాష్ట్రలో చిరుత కలకలం…పట్టపగలే దాడి

సిరీస్‌లో 146 పరుగులు చేసిన రోహిత్‌ శర్మ తన నెంబర్‌ వన్‌ ప్లేస్‌ను స్థిరంగా నిలబెట్టుకున్నాడు. శుభ్‌మన్‌ గిల్‌ ఐదో స్థానంలో కొనసాగగా, శ్రేయాస్‌ అయ్యర్‌ ఒక ర్యాంకు దిగజారి 10వ స్థానానికి చేరాడు. కేఎల్‌ రాహుల్‌ రెండు స్థానాలు మెరుగుపరుచుకొని 12వ స్థానంలో నిలిచాడు.

బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో కుల్దీప్‌ యాదవ్‌ మూడు స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి చేరుకున్నాడు. టెస్ట్‌ ర్యాంకుల్లో యశస్వీ జైస్వాల్‌ ఎనిమిదో స్థానంలో, గిల్‌ 11వ స్థానంలో, రిషబ్‌ పంత్‌ 13వ స్థానంలో ఉన్నారు.

టెస్ట్‌ బౌలింగ్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రా నెంబర్‌ వన్‌ స్థానంలో కొనసాగుతుండగా, మహమ్మద్‌ సిరాజ్‌, జడేజా, కుల్దీప్‌ వరుసగా 12వ, 13వ, 14వ స్థానాలు అందుకున్నారు. మరోవైపు యాషెస్‌లో 18 వికెట్లు దక్కించుకున్న మిచెల్‌ స్టార్క్‌ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి ఎగబాకాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *