Pm Modi on Uncliamed Assets: దేశవ్యాప్తంగా క్లెయిమ్ చేయని ఆస్తులపై ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లింక్డ్ఇన్(Linkdin)లో బుధవారం పోస్ట్ చేసారు. ప్రజలు మరిచిపోయిన లేదా ఇప్పటివరకు అందని నిధులను తిరిగి పొందేందుకు ఇది మంచి అవకాశం అని ఆయన తెలిపారు.
‘మీ ధనం–మీ హక్కు’ అని స్పష్టం చేస్తూ, ఈ నిధులను సులభంగా పొందేందుకు ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
ALSO READ:H-1B VISA షాక్…అపాయింట్మెంట్లు 2026కి వాయిదా
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ సంస్థల్లో భారీ మొత్తంలో క్లెయిమ్ చేయని నిధులు ఉన్నాయని మోదీ వెల్లడించారు. బ్యాంకుల ఖాతాల్లో సుమారు ₹78,000 కోట్లు, బీమా కంపెనీల్లో ₹14,000 కోట్లు, మ్యూచువల్ ఫండ్లలో ₹3,000 కోట్లు, డివిడెండ్ల రూపంలో మరో ₹9,000 కోట్లు యజమానుల కోసం ఎదురుచూస్తున్నాయని తెలిపారు.
ఈ మొత్తాలను ప్రజలు ధృవీకరణ ప్రక్రియ పూర్తిచేసి తిరిగి పొందవచ్చని చెప్పారు.
ఇందుకు సంబంధించి అవసరమైన సమాచారం, ప్రక్రియలు, సంబంధిత అధికారిక వెబ్సైట్ల లింకులను కూడా ప్రజలతో పంచుకున్నారని వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సౌకర్యాలను వినియోగించి ప్రతి ఒక్కరూ తమ హక్కైన ఆస్తులను క్లెయిమ్ చేసుకోవాలని మోదీ సూచించారు.
