Gold Rates Today | బంగారం ప్రియులకు శుభవార్త…తగ్గిన బంగారం ధరలు

Gold and silver rates chart showing today’s metal prices in India Gold and silver rates chart showing today’s metal prices in India

Gold Rate Today: దేశీయ మార్కెట్లో ఇటీవల పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు పెరగడంతో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మళ్లి బంగారంపై డిమాండ్ పెరిగింది. అలాగే, రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే బలహీనపడటం కూడా బంగారం రేట్లకు ప్రభావం చూపుతోంది.

ALSO READ:బీఆర్ఎస్–కాంగ్రెస్ ఘర్షణలో ఒకరు మృ*తి, పలువురికి గాయాలు

డిసెంబర్ 10న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర “₹1,29,430”, 22 క్యారెట్ల ధర “₹1,18,640″గా నమోదైంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర “₹1,29,580”, 22 క్యారెట్ల ధర “₹1,18,790″గా ఉంది. హైదరాబాద్‌, విజయవాడలో ధరలు అదే స్థాయిలో కొనసాగుతున్నాయి.

ఇక వెండి ధరలో స్వల్ప మార్పు కనిపించింది. నిన్నతో పోలిస్తే కిలో వెండి ధర సుమారు “₹100 మేర” పెరిగింది. ప్రధాన నగరాల్లో బంగారం–వెండి రేట్లు స్థిరంగా ఉంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *