Telangana Highway Tourism Plan | తెలంగాణ రైజింగ్ విజన్-2047లో కొత్త ప్రతిపాదనలు 

Telangana government highway tourism plan with resorts Telangana government highway tourism plan with resorts

Rising Vision–2047: తెలంగాణ టూరిజం అభివృద్ధిని వేగవంతం చేయడానికి ప్రభుత్వం హైవే టూరిజంపై ప్రత్యేక దృష్టిపెట్టింది. తెలంగాణ రైజింగ్ విజన్–2047(Rising Vision 2047)లో భాగంగా జాతీయ మరియు రాష్ట్ర రహదారులపై ప్రతి 100 కిలోమీటర్లకు ఒక రిసార్ట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

అదనంగా పిట్ స్టాప్స్, విశ్రాంతి గదులు, ఈవీ చార్జింగ్ స్టేషన్లు(EV charging stations), మోటల్స్, రైతుల ఆహారశాలలు వంటి సదుపాయాలను ఏర్పాటు చేసే ప్రణాళికను రూపొందించింది.

also read:బ్రాహ్మణుల కూతుళ్లపై కామెంట్లు: IAS సంతోష్ వర్మకు షోకాజ్ నోటీసులు

ఈ మోటల్స్‌లో స్థానిక వంటకాలు, హస్తకళలను ప్రోత్సహిస్తూ స్థానిక కళాకారులకు, రైతులకు కొత్తగా ఆదాయ మార్గాలను సృష్టించే అవకాశం ఉంది. ముఖ్యంగా హైవేలపై ప్రయాణించే పర్యాటకులు, లాంగ్‌డ్రైవ్ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రావడం వల్ల పర్యాటక రాకపోకలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.


ఈ ప్రాజెక్టులు అమలులోకి వస్తే తెలంగాణ పర్యాటకం మరింత బలోపేతం అవడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా లాభదాయకం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *