Delhi bomb conspiracy: ఢిల్లీ కారు బాంబు పేలుడు కుట్ర కేసు దర్యాప్తులో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్ట్ అయిన నిందితుడు ముజమ్మిల్ షకీల్, (muzammil shaheen nikah)సహ నిందితురాలు డాక్టర్ షహీన్ షాహిద్(shaheen) తన ప్రియురాలు మాత్రమే కాదని, 2023 సెప్టెంబర్‌లో అల్ ఫలా యూనివర్సిటీ సమీపంలోని మసీదులో శరియా ప్రకారం పెళ్లి చేసుకున్నట్లు విచారణ సంస్థలకు తెలిపాడు.
మెహర్‌గా ₹5,000–₹6,000 ఇవ్వడానికి అంగీకరించినట్లు వివరించాడు. ఈ విషయం ఆమె మాజీ భర్తకు, పిల్లలకు కూడా తెలియకపోవడం దర్యాప్తులో కీలక అంశంగా మారింది.
దర్యాప్తు ప్రకారం, డాక్టర్ షహీన్ 2023–24 మధ్య ముజమ్మిల్‌కు ఆయుధాలు, పేలుడు పదార్థాలు కొనుగోలుకు ₹27–₹28 లక్షల వరకు నిధులు సమకూర్చినట్లు అనుమానం.
ALSO READ:Rahul Sipligunj Wedding | అంగరంగ వైభవంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ వెడ్డింగ్
ఇందులో ఆయుధాల కోసం ₹6.5 లక్షలు, దాడిలో ఉపయోగించిన ఎకోస్పోర్ట్ కారు కొరకు ₹3 లక్షలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. షహీన్ మాత్రం ఈ మొత్తాన్ని మతపరమైన దాడులకు మాత్రమే ఇచ్చానని తెలిపింది.
ఇక కేసులో ఏడో అరెస్టుగా ఫరీదాబాద్‌కు చెందిన షోయాబ్‌ను NIA అదుపులోకి తీసుకుంది. దక్షిణ కాశ్మీర్‌లో చురుకుగా ఉన్న కొన్ని మాడ్యూళ్లు ఈ కుట్రకు ఆయుధాలు సరఫరా చేసిన అవకాశం ఉందని అధికారులు పరిశీలిస్తున్నారు.
అనేక రాష్ట్రాల్లో దర్యాప్తు వేగవంతం అయ్యింది.
